February 15, 2026
04:32 PM
తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రఫీ రంగ మిత్రులకు నమస్కారం.
తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రఫీ రంగ మిత్రులకు నమస్కారం. \r\n\r\nఅందరికీ ఒక ముఖ్యమైన విజ్ఞప్తి \r\n\r\n⭐ ఈ నెల 7, 8,9 తేదీలలో కేబిఆర్ కన్వెన్షన్, హైదరాబాద్ లో నిర్వహించిన ఇండియన్ వెడ్డింగ్ వర్క్ షాప్ అనంతరం నెలకొన్న పరిణామాల దృష్ట్యా\r\nగత వారం రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న దృష్ట్య \r\nఇది ఫోటోగ్రఫీ వ్యవస్థకు మంచిది కాదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వెంకట్ రెడ్డి గారు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు లింగమూర్తి గారి చొరవతో ఈరోజు పొటోటెక్ అధినేత అభిమన్యు రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హుస్సేన్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవీందర్ గారు, రాష్ట్ర కోశాధికారి భీమిడి మాధవ రెడ్డి గార్లతో ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది. \r\n\r\n✨ఈ సమావేశంలో గత ఏడాది ఓం కన్వెన్షన్ లో నిర్వహించిన Expo మొదలుకొని మొన్న KBR కన్వెన్షన్ లో నిర్వహించిన ఇండియన్ వెడ్డింగ్ వర్క్ షాప్ వరకుగల పరిణామాలను చర్చించారు.\r\n\r\n💥ఇక నుండి నిర్వహించే అన్ని కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ భాగస్వామ్యంతో నిర్వహిస్తామని అలాగే భవిష్యత్ లో ఎలాంటి నిర్ణయం అయిన తెలంగాణ అసోసియేషన్ తో కలిసి సమష్టిగా చర్చించిన అనంతరమే ముందుకు వెళతామని ఫోటో టెక్ టీం పేర్కొన్నారు.\r\n\r\n🌟సంఘం నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించిన ఉపేక్షించేది లేదని అలాంటి వారిపైన సంఘం పరంగా కట్టిన చర్యలు ఉంటాయని సంయుక్తంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.\r\n\r\n\r\n🌟కాబట్టి ఇక నుండి సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఎలాంటి ఆరోపణలు చేసుకోకూడదని తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ సభ్యులను విజ్ఞప్తి చేస్తున్నది. \r\n\r\n\r\n💥సభ్యులకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా సంప్రదింపులు జరిపి లేదా జిల్లా మరియు రాష్ట్ర అసోసియేషన్ ద్వారా\r\nసమస్యలను పరిష్కారం చేసుకోవాలని సూచించారు. \r\n\r\n🔥కాగా తాజా పరిస్థితులపై జిల్లా మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పూర్తి స్థాయిలో చర్చించి తగునిర్ణయలు ప్రకటిస్తామని రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ గారు పేర్కొన్నారు.\r\n\r\n\r\nఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్య సలహాదారులు మహిమల కేదార్ రెడ్డి గారు,కిషన్ గుప్తా గారు,భూశెట్టి శ్రీధర్ గారు,పూజ ల్యాబ్ అధినేత రాజేశ్వర్ రెడ్డి గారు,రాష్ట్ర కుటుంబ భరోసా ఇన్చార్జి నాగరాజు గారు,క్రమశిక్షణ కమిటి చైర్మన్ జగదీష్ గౌడ్,జాయింట్ సెక్రటరీ జంగారెడ్డి గారు PRO శేఖర్ గౌడ్ గారు పాల్గొన్నారు.\r\n \r\n\r\nఇట్లు\r\nతెలంగాణ రాష్ట్ర అసోసియేషన్